Mulkanoor: అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కెన్యా పర్యటన

Mulkanoor: అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కెన్య పర్యటన
భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్
ముల్కనూర్ కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి "అండర్ స్టాండింగ్ ది కెన్యా మోడల్ ఆఫ్ కో-ఆపరేటివ్ అండ్ అగ్రికల్చరల్ సిస్టమ్స్" స్టడీ విజిట్ కొరకు కెన్యాలోని మొంబాస నగరం లోని NEDAC జనరల్ అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ఫిబ్రవరి 24 నుండి 28 వరకు నిర్వహించారు. ఈ సమావేశంలో NEDAC ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముల్కనూర్ సహకార సంఘం చేపడుతున్న కార్యక్రమాలను, ప్రవీణ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కెన్యాలో విజయవంతమైన సహకార నమూనాలు, వ్యవసాయ క్రెడిట్ సహకార సంఘాలచే నిర్వహిస్తున్న వినూత్న వ్యూహాలు సభ్యుల ఓటింగ్ తో సహా కీలక నిర్ణయం తీసుకునే ప్రక్రియలను పరిశీలించారు. ఈ సమావేశంలో NEDAC చైర్మన్ పంకజ్ కుమార్ బన్సల్, ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని పాల్గొన్నారు.